Errabelli Dayakar Rao: స్వాతంత్ర్య పోరాటంలాగే తెలంగాణ పోరాటం సాగింది వరంగల్‌లో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగియి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్‌లో పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య భారతదేశమన్నారు. స్వాతంత్ర్య పోరాటం మాధిరిగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటం సాగిందన్న మంత్రి.. రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. By Karthik 15 Aug 2023 in రాజకీయాలు వరంగల్ New Update షేర్ చేయండి వరంగల్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారత్ స్వాతంత్ర్య దేశంగా అవతరించగలిగిందన్నారు. ఆంగ్లేయులను ఎదురించి, అహింసా నినాదంతో చేసిన పోరాట ఫలితంగానే దేశానికి ఆంగ్లేయుల నుంచి విముక్తి కలిగిందన్నారు. Your browser does not support the video tag. కాగా అదే స్పూర్తిని తీసుకున్న కేసీఆర్ 20 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిందన్న ఆయన.. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేక, బోర్లు ఉన్న రైతులకు విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆనేక ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. చేనుకు నీళ్లు కట్టాలని రాత్రి సమయాల్లో బోర్ల వద్ద పడుకున్న రైతులకు పాములు, తేల్లు కుట్టి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ముందుగా విద్యుత్ సమస్య లేకుండా చేయాలనే సంకల్పంతో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు విద్యుత్ ఇస్తామన్నా.. వద్దని కేరళ, ఒడిశా రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశారన్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్‌కు ఢోకా లేకుండా చేశారని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో తెలంగాణ ముందుందని ఇరత రాష్ట్రాలకు సైతం విద్యుత్ ఇచ్చే స్థాయికి ఎదిగిందని మంత్రి వెల్లడించారు. Your browser does not support the video tag. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. అందుకు కారణం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవ్వడమే అని మంత్రి తెలిపారు. ఈ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్ధవంతంగా సాగుతున్న పాలనకు నిదర్శనమన్నారు. అంతే కాకుండా తెలంగాణ తరహా పాలనను దేశ మంతటా విస్తరించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. భారతదేశం అధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడే దేశమని ఎర్రబెల్లి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారని, ఆ రాష్ట్రల్లో విద్యుత్ లేక రైతులు పంటలను పండిచలేకపోతున్నట్లు సీఎం గుర్తించారన్న ఆయన.. దేశ వ్యాప్తంగా విద్యుత్ వెలుగులు నింపాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నారన్నారు. #brs #warangal #errabelli-dayakar-rao #independence-celebrations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి