Independence day: పంద్రాగస్టు పండుగ.. కేసీఆర్ చేతుల మీదుగా పోలీసు అధికారులకు అవార్డులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టింది. ఇక కేసీఆర్ చేతుల మీదుగా ఇటివలి వరద సమయంలో అంకీతభావంతో పనిచేసిన పోలీసులకు అవార్డులు ఇవ్వనున్నారు.