Stage Collapse In Mexico Kills 9: మెక్సికో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల ప్రభావానికి ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర మెక్సికోలోని న్యూవో లియోన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. త్వరలో మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష పార్టీల అభ్యర్థలు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ (Jorge Alvarez Maynez) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఒక్కసారిగా స్టేజీ కూలిపోయింది.
Also Read: జులై 4న ఇంగ్లండ్‌లో సార్వత్రిక ఎన్నికలు..ఓటర్లను ఎదుర్కొననున్న ప్రధాని రిషి సునక్!
ఈ ప్రమాందలో 9 మంది మృతి చెందగా.. మరో 63 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. అధ్యక్ష అభ్యర్థి జార్జ్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ప్రచారాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన మృతుల కుటంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read: అంగారకుడిపై గ్రహాంతర వాసుల కోసం నాసా వేట!