/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-21-6.jpg)
Hyderabad: రోడ్లపై అతివేగంగా వాహనాలు నడపడం కంటే సురక్షితంగా గమ్యం చేరుకోవడం చాలా ముఖ్యమని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు చెప్పారు. సోమవారం పాతబస్తీ ఖిల్వత్ లోని తపస్యా జూనియర్ కళాశాలలో రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ముఖ్యంగా యువతకు కీలక సూచనలు చేశారు.
5వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష..
ఈ మేరకు 2023 హైదరాబాద్ లో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినందుకు 5 లక్షల 23వేల382 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2022తో పోలిస్తే రాంగ్రూట్లో వెళ్లే వారి సంఖ్య 86 శాతానికి పెరిగిందని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5వేల వరకు జరిమానా, మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తామని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రతి వాహనానికి నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లేకపోతే సెక్షన్ 80 (ఎ) 177 ఎంవీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Friendly Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 11 తర్వాత రోడ్డు ఎక్కారో అంతే!
యువత ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 నాటికి హైదరాబాద్లో దాదాపు 56.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, అందులో 18 లక్షల మందికి పైగా హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నట్లు చెప్పారు. చాలా మంది యువత అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్ధులు ఈ వయస్సు నుంచే పట్టుదల, కృషి, ఆత్మ విశ్వాసం అలవర్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తబస్సుమ్ ఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్- సిద్దు, ఫలక్ నుమా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, హెచ్ జి అధికారి (టి.టి.ఐ బేగంపేట) ,హీరో మోటార్ శ్రావణ్ కుమార్, మహమ్మద్ అయాన్-,పీసీ,కృష్ణ, తదితరులు పాల్గొని విలువైన సలహాలు ఇచ్చారు.