Friendly Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 11 తర్వాత రోడ్డు ఎక్కారో అంతే!

హైదరాబాద్ వాసులకు నగర పోలీసులు కీలక సూచన చేశారు. ఇకపై నగరంలో రాత్రి 11 తర్వాత ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హెచ్చరించారు. కారణం లేకుండా రోడ్లపై తిరిగినా, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ మాత్రమే ఉంటుందని మైక్‌లు పెట్టి చెబుతున్నారు.

New Update
Friendly Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 11 తర్వాత రోడ్డు ఎక్కారో అంతే!

Hyderabad: హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. ఇకపై నగరంలో రాత్రి 11 తర్వాత ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని సిటీ పోలీసులు హెచ్చరించారు. రాత్రి 11 దాటిన తర్వాత అకారణంగా రోడ్లపై తిరిగినా, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడిన ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ మాత్రమే ఉంటుందని మైక్‌లు పెట్టి చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటల లోపే పాతబస్తీలో పాన్ షాపులు,హోటళ్లు మూసేయాలని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. పోలీసుల నిర్ణయంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. నగరంలో ఆఫీస్‌లు రాత్రి 11 గంటలకు ముగుస్తుందని, ఆ సమయంలో డిన్నర్ ఎక్కడ చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు