Stree 2: ‘ఓ స్త్రీ రేపు రా’ మళ్లీ వస్తోంది.. టీజర్ చూస్తే వణుకు పుట్టాల్సిందే! ‘ఓ స్త్రీ రేపు రా’ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 'స్త్రీ' సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘స్త్రీ 2’ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు వినోదంతోపాటు ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుడుతుందంటూ దర్శకుడు అమర్ కౌశిక్ క్యూరియాసిటీ పెంచేశాడు. By srinivas 14 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stree 2: ‘ఓ స్త్రీ రేపు రా’ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘స్త్రీ 2’ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు వినోదంతోపాటు ప్రేక్షకుల ఒంట్లో వణుకు కూడా పుడుతుందంటూ దర్శకుడు అమర్ కౌశిక్ క్యూరియాసిటీ పెంచేశాడు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) అభిమానుల్లో మరితం ఉత్కంఠ.. ఈ మేరకు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, తమన్నా, అభిషేక్ బెనర్జీ, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ‘స్త్రీ 2’ను దర్శకుడు అమర్ కౌశిక్. తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే 'స్త్రీ' పేరుతో వచ్చిన మొదటి పార్ట్ భారీ ప్రేక్షకాధారణ పొందగా రెండో పార్ట్ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో మరితం ఉత్కంఠ పెరిగింది. అయితే ఇటీవలే సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ ఇస్తున్న మేకర్స్.. తాజాగా త్వరలోనే టీజర్ రిలజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 2024 ఆగస్టు 30న విడుదల కాబోతున్న సినిమా నుంచి మరో రెండు వారాల్లో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్రపంచం.. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు అభిషేక్ బెనర్జీ.. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే ఇది రెట్టింపు వినోదం, భయం పుట్టిస్తుందన్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌తో మరోసారి దర్శకుడు అమర్ కౌశిక్ తను సృష్టించిన ప్రత్యేక ప్రపంచంతో సినీప్రియుల్ని ఆశ్చర్యపరుస్తారనే నమ్మకం ఉంది. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. #teaser-release #stree-sequel-stree-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి