Stree 2 : షారుక్ 11 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసిన 'స్త్రీ 2'..!

బాలీవుడ్‌ లేటెస్ట్ హారర్ మూవీ 'స్త్రీ 2' పెయిడ్ ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించింది. కేవ‌లం పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో రూ.10 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి.. షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’(రూ. 8కోట్లు) సాధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అవలీలగా దాటేసింది.

Stree 2 : షారుక్ 11 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసిన 'స్త్రీ 2'..!
New Update

Stree 2 Movie : బాలీవుడ్‌ లేటెస్ట్ హారర్ మూవీ 'స్త్రీ 2' రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించినఈ మూవీ సరిగ్గా ఐదేళ్ల క్రితం వచ్చిన 'స్త్రీ' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. అంతకంటే ముందే పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

'స్త్రీ 2' మూవీ 2013 నుంచి సుమారు 11 ఏళ్ల పాటు షారుఖ్ ఖాన్ పేరిటా ఉన్న రికార్డును బ‌ద్ద‌లుకొట్టింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’(రూ. 8కోట్లు) సాధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అవలీలగా దాటేసింది. కేవ‌లం పెయిడ్ ప్రీమియ‌ర్స్‌తో రూ.10 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Also Read : ‘మిస్టర్ బచ్చన్’ రివ్యూస్ పై రియాక్ట్ అయిన హరీష్ శంకర్.. ఇదేం కొత్త కాదంటూ

దీంతో దేశంలోనే మొదటిసారి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన పెయిడ్‌ ప్రీమియర్స్ చిత్రంగా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద నిలిచింది.ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ విషయంలోనూ రికార్డులు సృష్టించిన స్త్రీ 2, తన విజయం యాత్రను కొనసాగిస్తూనే ఉంది. ఈ చిత్రం ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

#stree-2-movie #shah-rukh-khan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe