Strawberry Viral Video: వామ్మో.. స్ట్రాబెర్రీని మైక్రోస్కోప్‌లో చూస్తే అస్సలు తినరు

అందంగా కనిపించడంతోపాటు అద్భుత రుచి ఉన్న పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. మైక్రోస్కోప్‌లో స్ట్రాబెర్రీలు ఎలా ఉంటాయనే వీడియో ఇటీవల ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. పండు లోపల నుంచి కొన్ని పురుగులు బయటకు రావడం కూడా కనిపిస్తోన్న ఆ వీడియోని చూసి నెటిజెన్లు వ్యంగ్యంగా సలహా ఇస్తున్నారు.

New Update
Strawberry Viral Video: వామ్మో.. స్ట్రాబెర్రీని మైక్రోస్కోప్‌లో చూస్తే అస్సలు తినరు

Strawberry Viral Video: మైక్రోస్కోప్‌లో స్ట్రాబెర్రీలు ఎలా ఉంటాయనే వీడియో ఇటీవల ట్విట్టర్‌లో కొందరు షేర్‌ చేశారు. అందంగా కనిపించడమే కాకుండా అద్భుత రుచి కలిగి ఉన్న పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. ఈ పండు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా మైక్రోస్కోప్‌లో ఎలా కనిపిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల ట్విటర్‌లో కొందరు షేర్‌ చేశారు.

publive-image

ఒక వ్యక్తి మైక్రోస్కోప్ కింద స్ట్రాబెర్రీని ఉంచాడు. క్లోజప్‌లో చూస్తే చిన్న చిన్న కీటకాలు పండుపై పాకుతున్నట్లు చూపిస్తుంది. అంతేకాకుండా పండు లోపల నుంచి కొన్ని పురుగులు బయటకు రావడం కూడా కనిపిస్తోంది.

publive-image

ఈ పోస్ట్ ఏప్రిల్ 1న షేర్ చేశారు. పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఎంతో మంది లైక్‌లు, షేర్లు కూడా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

స్ట్రాబెర్రీలను వెనిగర్‌ లేదా బేకింగ్‌ సోడా లేదా ఉప్పు కలిపి 20 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత తినాలని సలహా ఇస్తున్నారు. మరికొందరు అయితే బజార్లలో దొరికేవాటిని తినకుండా తోట నుంచి ఫ్రెష్‌గా తెచ్చుకొని తినడం మంచిదని అంటున్నారు. మరో యూజర్‌ అయితే పురుగులను పోగొట్టలేం అందుకే కడుపులో ఆమ్లాన్ని పెంచుకోవాలంటూ వ్యంగ్యంగా సలహా ఇచ్చాడు.

ఇది కూడా చదవండి:  సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు