తెలంగాణలో విచిత్ర వాతావరణం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పగలంతా ఉక్కపోత..రాత్రివ్వగానే విపరీతమైన చలి పెడుతోంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులతో చిన్నారుల నుంచి వ్రుద్ధుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో వాతావరణంలో తేమశాతం పెరగడం...పగలు సగానికి సగం పడిపోవడవమే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం… నటుడు అనుమానాస్పద మృతి..!!
గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్ర నమోదు అయినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని బట్టే పగలు రాత్రి సమయాల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నది అర్థం అవుతుంది. రాజధాని హైదరాబాద్ లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ అత్యధికంగా 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అత్యల్పంగా 2.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
అటు నిజామాబాద్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అత్యల్పంగా 1.2 డిగ్రీలకు పడిపోయింది. పగలు ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా ఉండగా భద్రాచలంలో కూడా అత్యల్పంగా 1.8 డిగ్రీలు నమోదు అయ్యింది. మధ్యాహ్న సమయంలో 33.4 నమోదు అయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ పగటి ఉష్ణోగ్రత అధికంగానే ఉంది. ఒక నల్లగొండ జిల్లాలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు మరో షాక్.. బీఆర్ఎస్ లోకి నాగం జనార్ధన్ రెడ్డి?