/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AP-CM-Jagan-Attack-jpg.webp)
Special Investigation Team On YS Jagan Attack: సీఎం జగన్‌పై దాడితో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. ఈ మేరకు ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజయవాడలో నిన్న సీఎంపై దాడి జరిగిన ప్రాంతాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు పరిశీలించాయి. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఫుటేజీ సేకరిస్తున్నారు. సీఎంపై ఎయిర్‌గన్‌తో దాడి జరిగిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. దాడి తర్వాత నిందితులు ఎలా తప్పించుకున్నారు? అన్న అంశంపై దృష్టి సారించారు. దాడి సమయంలో భారీగా శబ్ధం రావడంతో ఎయిర్‌గన్‌తో కాల్చి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరో వైపు జగన్ పై దాడికి నిరసనగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.