Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ!

స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ప్రారంభం అయింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే, సెన్సెక్స్ 77,347 స్థాయిని తాకింది. తరువాత స్వల్ప తగ్గుదలతో శుక్రవారం కంటే 300 పాయింట్ల ఎగువన 77,300 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మారోవైపు నిఫ్టీకూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. 

Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ!
New Update

Stock Market : స్టాక్ మార్కెట్ ఈ రోజు అంటే జూన్ 18న సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ (Sensex) 77,347 స్థాయిని తాకింది. ప్రస్తుతం 300 పాయింట్లకు పైగా ఎగబాకి 77,300 స్థాయి వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ (Nifty) కూడా ఈరోజు 23,573 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ప్రస్తుతం 100 పాయింట్లకు పైగా ఎగబాకి 23,550 స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు, నిఫ్టీ కూడా శుక్రవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ, ఎనర్జీ షేర్లలో మరింత ఊపందుకుంది.

మార్కెట్ బూమ్ కారణంగా.. 

  • సోమవారం అమెరికా మార్కెట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. డౌ జోన్స్ 0.49% లాభంతో 38,778 వద్ద ముగిసింది. S&P కూడా 0.77% పెరిగి 5,473 వద్ద ముగిసింది.
  • 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 22 స్టాక్‌లు కొనుగోలు అయ్యాయి. 8 అమ్మకాల్లో పడ్డాయి. నిఫ్టీ 50లో 40 షేర్లలో కొనుగోళ్లు, 10 షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి.
  • చాలా రంగాలు జోరుగా ట్రేడవుతున్నాయి. ఐటీలో 0.83 శాతం వృద్ధి నమోదైంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.65% - మెటల్ 0.59% పెరిగాయి.

Stock Market Today : 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్ లభించడంతో HAL షేర్లు 5% కంటే ఎక్కువ పెరిగాయి. ఈ వార్తల కారణంగా, HAL షేర్లు 5% కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తున్నాయి.

Also Read : నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

#stcok-market #nifty-record #stock-market-today #sensex-today
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe