Stock Market Holiday: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో ముగియనున్నాయి. ఇప్పటివరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగ్గా ఇప్పుడు ఐదో దశ పోలింగ్ ఈరోజు అంటే మే 20వ తేదీన జరుగుతున్నాయి. ఓటింగ్ కారణంగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అంతేకాకుండా, ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా క్లోజ్ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో మే 20, సోమవారం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు, కానీ బ్యాంక్ బ్రాంచ్‌కు సంబంధించిన ఏ పనిని నిర్వహించలేరు. స్టాక్ మార్కెట్‌లో మీరు ఎటువంటి ట్రేడింగ్ చేయలేరు.
Stock Market Holiday: ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దీని తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో నాలుగు దశల ఓటింగ్ పూర్తయింది. ఇప్పుడు మే 20న దేశవ్యాప్తంగా 49 స్థానాల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
ఈ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది
Stock Market Holiday: RBI ఇచ్చిన సమాచారం ప్రకారం, లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ కారణంగా మే 20న లక్నో, ముంబై , బేలాపూర్‌లలో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ముంబైలో ఓటింగ్ కారణంగా స్టాక్ మార్కెట్ కూడా పనిచేయదు. ఓటింగ్ కారణంగా ఈ నెలలో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మహారాష్ట్ర దినోత్సవం- కార్మిక దినోత్సవం సెలవులతో ఈ నెల ప్రారంభమైంది.
Also Read: ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..
మే నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి
Stock Market Holiday: మే 8న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా బెంగాల్‌లో బ్యాంకులు మూతపడగా, మే 10న బసవ జయంతి/అక్షయ తృతీయ కారణంగా కర్ణాటకలో బ్యాంకులు మూతపడ్డాయి. మే 13న, 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నాల్గవ దశ ఓటింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు ఉండగా, మే 16న రాష్ట్ర దినోత్సవం రోజున సిక్కింలో బ్యాంకులు మూసివేశారు. ఇది కాకుండా, గత నాలుగు దశల ఓటింగ్ కారణంగా, దేశవ్యాప్తంగా చాలా చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి.
Stock Market Holiday: 2024 లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ కారణంగా మే 20న కొన్ని చోట్ల బ్యాంకులు క్లోజ్ చేశారు. ఇది కాకుండా త్రిపుర, మిజోరాం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ, లక్నో, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో 23 మే, గురువారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. దీనితో పాటు, నజ్రుల్ జయంతి కారణంగా మే 25 న కొన్ని చోట్ల బ్యాంకులు క్లోజ్ చేస్తారు. అదే రోజు, 2024 సార్వత్రిక ఎన్నికల ఆరవ దశ జరగనుంది. దీని కారణంగా త్రిపుర - ఒరిస్సాలో బ్యాంకులకు సెలవు.