Stock Market Down : ఆర్‌బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం!

ఆర్‌బీఐ రేపో రేట్లపై తీసుకున్న నిర్ణయం ప్రభావంతో సెన్సెక్స్ 582 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. మరోవైపు నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయింది. ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్ 870 పాయింట్లకు పైగా పెరిగింది. ఆర్‌బీఐ వైఖరి ఊహించిన దానికంటే కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Stock Market Today : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని.. అలాగే, RBI తన వైఖరిలో కఠినంగా ఉంటుందని సూచించింది. దీని కారణంగా స్టాక్ మార్కెట్‌లోని రెండు ప్రధాన ఇండెక్స్ లలో గురువారం  భారీ క్షీణత కనిపించింది. RBI ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. దీని ఎఫెక్ట్ మొత్తం ద్రవ్యోల్బణంపై కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ఆర్బీఐ వైఖరి మరింత కఠినంగా ఉండే ఆవకాశం ఉంది. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో సెన్సెక్స్ 582 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. మరోవైపు నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయింది. కాగా ఒక రోజు ముందు అంటే బుధవారం మార్కెట్‌లో 870 పాయింట్లకు పైగా పెరుగుదల కనిపించింది. ఆర్బీఐ నిర్ణయాలు పెద్దగా కఠినంగా ఉండకపోవచ్చన్న అంచనాల మధ్య ఈ పెరుగుదల కనిపించిందని నిపుణులు భావించారు. అయితే, ఇప్పుడు ఆర్‌బీఐ వైఖరి ఊహించిన దానికంటే కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గురువారం మళ్ళీ మార్కెట్ ఈ తగ్గుదల కనబరిచింది. ఇందువల్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ.2.82 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనం
Stock Market Down : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఒక రోజు పెరుగుదల తర్వాత భారీ పతనాన్ని చవిచూసింది. గణాంకాల ప్రకారం, సెన్సెక్స్ 582 పాయింట్ల లాభంతో 78,886.22 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ కూడా 78,798.94 పాయింట్లతో రోజు దిగువ స్థాయికి చేరుకుంది. అయితే ఈరోజు సెన్సెక్స్ 79,420.49 పాయింట్లతో ప్రారంభమైంది. ఒక రోజు క్రితం, సెన్సెక్స్ 875 పాయింట్లు పెరిగింది.

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ప్రధాన సూచీ నిఫ్టీ 180 పాయింట్ల పతనంతో 24,117 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ కూడా 24,079.70 పాయింట్లతో దిగువ స్థాయికి చేరుకుంది. అయితే, గురువారం నిఫ్టీ 24,248.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒకరోజు క్రితం నిఫ్టీలో 305 పాయింట్ల పెరుగుదల కనిపించింది.

పెరుగుతున్న- పడిపోతున్న స్టాక్స్
ముందుగా పడిపోతున్న స్టాక్‌ల గురించి చూసినట్లయితే, L&T IM NSEలో అతిపెద్ద నష్టాన్ని చూసింది. ఇది 4 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. గ్రాసిమ్ షేర్లు 3.60 శాతం పతనంతో ముగిశాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించాయి. ఇక  ఇన్ఫోసిస్ షేర్లు 2.94 శాతం పడిపోయాయి. పెరుగుతున్న స్టాక్స్ విషయానికి వస్తే, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్లు ఒకటిన్నర శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కాగా, ఎస్‌బిఐ లైఫ్ సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి.

ఇన్వెస్టర్లు రూ.2.82 లక్షల కోట్లు నష్టపోయారు
ఒకరోజు క్రితం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మంచి రికవరీ సాధించి రూ.9 లక్షల కోట్లు జేబులో వేసుకున్నారు. అంతకు ముందు వరుసగా మూడు రోజులు తగ్గుముఖం పట్టడంతో రూ.22 లక్షల కోట్ల నష్టం వచ్చింది. బుధవారం గురించి మాట్లాడుకుంటే, ఇన్వెస్టర్లు రూ.2.82 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. డేటా ప్రకారం, BSE  మార్కెట్ క్యాప్ ఒక రోజు క్రితం రూ.4,48,57,306.55 కోట్లుగా ఉంది, ఇది రూ.4,45,75,507.12 కోట్లకు తగ్గింది.

Also Read : టాలీవుడ్ లో మహేష్ కు మాత్రమే సొంతమైన ఏకైక రికార్డు ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు