Russia : విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

రష్యాలో మోదీ జరుగనున్న నేపథ్యంలో... ఆ దేశం పై ఉక్రెయిన్‌ నిప్పుల వర్షం కురిపిస్తుంది. అందుకు గానూ అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. దీంతో రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు.

Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్‌!
New Update

State Of Emergency : ఉక్రెయిన్‌ - రష్యా (Ukraine - Russia) ల మధ్య యుద్దం కొత్త మలుపులు తిరుగుతుంది. అమెరికా, ఐరోపా దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై నిప్పులు కురిపిస్తోంది. డ్రోన్లు, మిస్సైళ్లతో సరిహద్దులోని రష్యా నగరాలు, గ్రామాలపై భీకర దాడులకు పాల్పడుతుంది. ఈక్రమంలోనే తాజాగా రష్యాలోని వొరోనెజ్‌ రీజియన్‌లోని పలు ఏరియాల్లో పుతిన్ (Putin) గవర్నమెంట్‌ ఎమెర్జెన్సీని ప్రకటించింది.

ఈ ప్రాంతంలోని రష్యా ఆర్మీకి చెందిన మందుగుండు గోదాములు లక్ష్యంగా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడులు (Drone Attack) చేసింది. దీంతో ఆ గోదాముల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని వొరోనెజ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ గుసేవ్‌ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని మోదీ (PM Modi) రష్యా పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం భారత అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Also read: టీటీడీ నుంచే ప్రక్షాళన: సీఎం చంద్రబాబు

#pm-modi #drone-attack #russia-ukraine #state-of-emergency
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe