Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్..42 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లను చెబుతోంది. తాజాగా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

SBI Alert: ఖాతాదారులకు ఎస్​బీఐ అలర్ట్​...ఆ సర్వీసులు బంద్..!!
New Update

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఉద్యోగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 42 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను వీటి ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27గా నిర్ణయించారు. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చును.

Also read:ఒత్తిడి ఉండదని ఎవరు చెప్పారు..అయినా ఆడతాం అంటున్న కోచ్ ద్రావిడ్

డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) లలో మొత్తం 42 పోస్ట్ లకు నోటిఫికేషన్ పడింది. వీటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులుగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు 25 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చును. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.750. SC/ST/PWBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఇంటర్వ్యూ ప్రక్రియ..

ఈ పోస్టులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in ను ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. ముందుగా సూచనలు, నియమాలు చదివి, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి. తరువాత ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది. తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దీన్ని అక్కడే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చును.

Also read:ఏపీలో కులగణన కోసం ప్రత్యేక యాప్.. వారంలోపే పూర్తి సర్వే

#jobs #state-bank-of-india #latest-job-notifications-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe