Health Tips: ఈ టీ తాగితే మందుబాబులకు కిక్కుదిగాల్సిందే...!!

టీ తాగుతే..రిఫ్రెష్ మెంట్ ఉంటుందని...అందుకే తాగుతామని చాలా మంది చెబుతుంటారు. కానీ టీ రిఫ్రెష్ మెంట్ మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ టీ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరగుపడుతుందని చూపేందుకు ఎన్నో పరిశోధనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల టీలు తాగితే ...ఆల్కాహాల్ సేవించే వారు కూడా వీటికి అలవాటు పడతారు. ఆ టీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

New Update
Health Tips:  ఈ టీ తాగితే మందుబాబులకు కిక్కుదిగాల్సిందే...!!

మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే టీ తాగడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటామని భావిస్తారు. సీజన్ ఏదైనా సరే రుచికరమైన టీ తాగాల్సిందే. ఎందుకంటే టీనీ చల్లగా అంటే ఐస్ టీ, వేడిగా కూడా తాగుతుంటారు. టీలో చాలా రకాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల టీలను తాగుతే మందుబాబులు కూడా మర్చిపోరు. ఆల్కాహాల్ కు బదులుగా ఈ టీలను తాగుతారు. అవేంటో చూద్దాం.

పిప్పరమింట్ టీ:
పుదీనా ఆకులు మన ఆరోగ్యానికి సహజ ఔషధం రూపంలో లభించే అత్యుత్తమ మూలికలుగా పేరుగాంచాయి. పిప్పరమెంటు లీఫ్ టీని తయారు చేసి త్రాగడం వల్ల మన పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని సువాసన సహజంగా మన కడుపుని ప్రశాంతపరుస్తుంది. పిప్పరమెంటులో ఉండే మిథనాల్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ చికిత్సలో సహాయపడుతుంది. ఇది మన కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఇతర లక్షణాలను కూడా తొలగిస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. తాజా పుదీనా దొరికితే లీటరు నీటిలో ఏడు నుంచి పది ఆకులను వేసి బాగా మరిగించి 10 నిమిషాల తర్వాత వడకట్టాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అందులో రెండు చుక్కల తేనె వేసి తాగాలి.

ఇది కూడా చదవండి: దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. సీఎం అదిరిపోయే శుభవార్త!

చమోమిలే టీ:
రాత్రి సమయంలో నిద్రలేమి, మానసిక ఆందోళనతో బాధపడుతున్న చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా, చర్మ సమస్యలు, మొటిమల సమస్యలు ఉన్నవారు కూడా దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. ఎండు చామంతి పూలను తెచ్చి ఇంట్లోనే ఒక గ్లాసు టీని తయారు చేసుకుని ప్రతిరోజూ తాగవచ్చు.దీన్ని సిద్ధం చేయడానికి, స్టవ్ మీద ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. దీనికి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఎండిన చమోమిలే పువ్వులను జోడించండి. కొన్ని నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత వడకట్టి అందులో కాస్త తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగాలి.

అల్లం టీ:
అల్లం ఒక అద్భుతమైన ఔషధ పదార్ధం. వికారం, వాంతులు, కడుపు నొప్పితో బాధపడేవారికి అల్లం దివ్యౌషధమని చెబుతారు. ఇది బహిష్టు సమయంలో స్త్రీలు అనుభవించే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను గణనీయంగా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అల్లం టీ సిద్ధం చేయడానికి మీరు పచ్చి అల్లం లేదా అల్లం పొడిని ఉపయోగించవచ్చు. దీన్ని 10 నిమిషాల పాటు నీళ్లలో వేసి బాగా ఉడికించి, వడకట్టి అందులో కాస్త తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగాలి.

ఇది కూడా చదవండి:  పిండి పురుగు పట్టకుండా ఉండాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి…!!

సోంపు టీ:
సోంపు టీ మీ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా, యాంటీఆక్సిడెంట్ ప్రభావంతో మీ శరీరంలోని ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడే గుణం కలిగి ఉంటుంది. మీ పొట్టలో అల్సర్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కాబట్టి కడుపులో అల్సర్ ఉందని తెలిస్తే సోంపు గింజల టీతో దాన్ని పోగొట్టుకోవచ్చు. ఇది మలబద్దకానికి దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. దీని కోసం పావు లీటరు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించి వడగట్టి తాగాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు