రెండు పెద్ద టోర్నీల ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలిందా..? ఆ ప్లేయర్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎందుకు ప్రకటించాడు. గత వర్డల్ కప్‌లో ఆడిన ఆనుభవం ఉన్న ఈ ఆటగాడు తనంతట తానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడా.. లేక బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారా..? వరల్డ్ కప్ ముందు పాక్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చా.?
పాకిస్థాన్ పేస్ బౌలర్ వహాబ్ రియాజ్‌అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంతకాలం పాకిస్థాన్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, తనకు సహకరించిన పాక్ క్రికెట్ బోర్డుకు, తోటి ఆటగాళ్లకు, సిబ్బందికి రియాజ్ ధన్యవాదాలు తెలిపాడు. 2008లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. అదే సంవత్సరం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో సైతం ఆరంగ్రేటం చేశాడు. పాకిస్థాన్ టీమ్ పాల్గొన్న 2011, 2015, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో వహాబ్ రియాజ్ పాల్గొన్నాడు. 38 ఏళ్ల రియాజ్ పాక్ తరుఫున మొత్తంగా 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 81, వన్డేల్లో 120, టీ20లలో 34 వికెట్లు పడగొట్టాడు.
పాకిస్థాన్ స్టార్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్‌కు ఈ మధ్య అవకాశాలు రావడంలేదు. అంతే కాకుండా పాక్ టీమ్‌లో చోటు సంపాధించిన కొత్త బౌలర్ షాహీన్ అఫ్రిది ఆ టీమ్‌లో కీలక బౌలర్‌గా మారాడు. రియాజ్ స్థానాన్ని తను దక్కిచుకోంవడంతో అతనికి అవకాశాలు రావడం లేదు. చివరిసారిగా 2020 డిసెంబర్‌లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన వహాబ్ రియాజ్.. పాకిస్తాన్ సూపర్ లీగ్, మెన్స్ హండ్రెడ్, గ్లోబల్ టీ20 కెనడా, కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌ల్లో ఆడాడు. మరోవైపు అతి త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలు జరుగునున్నాయి. ఈ నెల చివరి వారంలో ఆసియా కప్ టోర్నీ జరుగనుండగా, సెప్టెంబర్ నెలలో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలకు ముందు రియాజ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీద కోపంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా ఈ బౌలర్ భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల ముందు క్రికెట్‌కు విడ్కోలు పలకడం చర్చనీయంశంగా మారింది. అయితే వహాబ్ రియాజ్ రాజకియాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.