BiggBoss Telugu : ఈ వారమే బిగ్ బాస్ సీజన్ - 8.. ఈసారి అన్నీ లైవ్ లోనే

బిగ్ బాస్ సీజన్ -8 టైమింగ్స్ వివరాలను స్టార్ మా తాజాగా వెల్లడించింది. బిగ్‌బాస్‌-8 సెప్టెంబరు 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుందని అధికారికంగా తెలిపింది. గత సీజన్‌ మాదిరే ఈసారి కూడా హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది.

New Update
BiggBoss Telugu : ఈ వారమే బిగ్ బాస్ సీజన్ - 8.. ఈసారి అన్నీ లైవ్ లోనే

BiggBoss Telugu Season-8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా స్టార్ మా లేటెస్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టైమింగ్స్ తో పాటూ అన్ని వివరాలను వెల్లడించింది. బిగ్‌బాస్‌-8 సెప్టెంబరు 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుందని స్టార్‌ మా అధికారికంగా తెలిపింది. గత సీజన్‌ మాదిరే ఈసారి కూడా హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది.

మరోవైపు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిలో ముఖ్యంగా రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి,పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ, కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు