Samantha Ruth Prabhu: సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం పై పూర్తి ద్రుష్టి పెట్టారు. గతంలో సైన్ చేసిన ప్రాజెక్ట్స్ మాత్రం పూర్తి చేశారు. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కొంత కాలంగా మాయోసైటీస్ తో బాధపడుతున్న సమంత.. ఇప్పుడు తన ఫోకస్ అంతా ఆరోగ్యం పై పెట్టారు. ఫిట్నెస్ కోసం తరచూ జిమ్ లో వర్క్ ఔట్స్, యోగ, మెడిటేషన్ వ్యాయామాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంటారు. అప్పుడుడప్పుడు వాటిని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు.
Also Read : Operation Valentine Trailer : “ఏం జరిగిన చూస్కుందాం”.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్
జిమ్ లో సామ్ ఫీట్స్
అయితే తాజాగా.. ఈమె షేర్ చేసిన ఓ వర్క్ ఔట్ ఫోటో అందరు ఆశ్చర్యపడేలా చేస్తోంది. కాలు.. తన హైట్ లో పైకి ఎత్తి వర్క్ ఔట్ చేస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. త్వరలోనే యాక్షన్ సినిమాకు 'బీ రెడీ' అన్నట్లుగా హింట్ ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పూర్తి యాక్షన్ సినిమాకు సిద్దమవుతున్నట్లుగా ఆ ఫోజ్ కనిపిస్తుందని అంటున్నారు. దీంతో సమంత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా కనిపిస్తారు సామ్. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, పెట్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తారు.
Also Read: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్