Operation Valentine Trailer: "ఏం జరిగిన చూస్కుందాం" .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. By Archana 20 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Operation Valentine Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శక్తికాంత్ దర్శకత్వం వహించారు. సందీప్ ముద్ద సోనీ పిక్చర్స్ బ్యానర్ (Sony Pictures) పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గుపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, దేశభక్తి డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ లో కనిపించింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ వరుణ్ తేజ్ ఒంటి నిండా గాయాలతో ఉన్న విజువల్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. దేశం కోసం ఎంతటి సహసమైన చేయగలిగే ఒక ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా వరుణ్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ట్రైలర్ లో "ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు.. ఏం జరిగినా చూస్కుందాము".. అంటూ దేశభక్తిని రగిలించే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రాడార్ ఆఫీసర్ గా మానుషీ చిల్లర్ డైలాగ్స్ , వరుణ్ తేజ్ యాక్షన్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో.. 40 కి పైగా జవాన్లు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదుల పై ఎలాంటి అటాక్ చేసింది అనేదే ఈ సినిమా కథ. ట్రైలర్ చూస్తుంటే.. సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవదీప్, రుహనీ శర్మ, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ప్రపంచ సుందరి మానుషీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్ #operation-valentine #operation-valentine-trailer #varun-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి