Ranveer Singh: మూవీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నటీనటులకు పేరు, డబ్బు, విజయం లభిస్తాయి. అయితే ఈ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఒకటి. దీనివల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. చాలామంది హీరోయిన్లు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పారు.అయితే ఒక టాప్ హీరో కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కెరీర్ ప్రారంభంలో అతన్ని ఒక సినిమా సెట్ నుంచి వెళ్లగొట్టారు, ఎంతో అవమానించారు. కానీ అన్ని అవరోధాలను ఎదుర్కొన్న ఆ నటుడు, ఇప్పుడు టాప్ బాలీవుడ్ సెలబ్రిటీగా నిలచాడు. అతడి పేరు రణ్‌వీర్ సింగ్.
ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF)తో కెరీర్ ప్రారంభించిన రణ్‌వీర్ సింగ్.. వర్సటైల్ యాక్టింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు.సినిమాల్లో రాణించడానికి ముందు రణ్‌వీర్ సింగ్ మూడేళ్లు పాటు ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టాల గురించి చెబుతూ, ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ‘క్యాస్టింగ్ కౌచ్’ అనుభవాన్ని పంచుకున్నాడు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ రణ్‌వీర్‌ను అంధేరిలోని తన ఇంటికి పిలిచాడట. ఆయన గురించి రణ్‌వీర్ చెబుతూ, “అతడు చాలా నీచమైన వ్యక్తి. నా పోర్ట్‌ఫోలియో కూడా చూడలేదు. 500 పేజీల పోర్ట్‌ఫోలియో ఎవ్వరూ పట్టించుకోరని నాకు తెలుసు. కానీ నాది చాలా బాగుండేది. దాన్ని కనీసం చూడాలని అందరూ అనుకునేవారు.” అని చెప్పాడు.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్ళు పాడవుతున్నాయని సంకేతం..!
ఆ తర్వాత, సినిమా రంగంలో ముందుకు సాగాలంటే స్మార్ట్‌గా, సెక్సీగా ఉండాలని ఆ డైరెక్టర్ రణ్‌వీర్‌కు చెప్పాడట. “ఏదో ఇవ్వడానికీ, తీసుకోడానికీ (లైంగిక సంబంధం) సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చాడు. కానీ నేను తిరస్కరించగానే, అతను బాధపడటం, బతిమిలాడటం మొదలుపెట్టాడు. ‘కనీసం తాకడానికైనా, చూడటానికైనా ఓకే చెబుతావా?’ అని అడిగాడు. ఆ తర్వాతే అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నేను ‘నో’ చెప్పగానే, భగ్న ప్రేమికుడిలా బాధపడ్డాడు.” అని రణ్‌వీర్ చెప్పుకొచ్చాడు.కేవలం ‘క్యాస్టింగ్ కౌచ్’ అనుభవమే కాదు, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ఎన్నో ఎదురు దెబ్బలు అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ‘టిప్ టిప్ బర్సా పానీ’ సినిమా షూటింగ్ సమయంలో రవీనా టాండన్‌ని చూస్తూ ఉండగా సెట్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. రాజీవ్ మసంద్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
“అప్పుడు నేను చిన్నవాడిని, రవీనాను చూస్తూ ఉండిపోయా. నా కళ్లు విప్పార్చి చూస్తుంటే ఆమెకు ఇబ్బందిగా అనిపించిందనుకుంటాను. ఓ సెక్యూరిటీ వ్యక్తిని పిలిచి నన్ను బయటకు పంపించమని చెప్పింది. నాకు అప్పుడు చాలా బాధ కలిగింది. సెట్ నుంచి వెళ్లమని చెప్పడంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.” అని రణ్‌వీర్ గుర్తు చేసుకున్నాడు.అయితే ఆ కష్టాలు, అనుభవాలే నేటి రణ్‌వీర్‌ను తీర్చిదిద్దాయి. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడిగా రాణిస్తున్న ఈ హీరో బాజీరావు మస్తానీ, గల్లీ బాయ్, పద్మావత్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో టాప్ హీరోగా ఎదిగాడు.ప్రస్తుతం ఈ హ్యాండ్సమ్ హీరో ముంబైలో రూ.119 కోట్ల విలువైన ఇంట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాకుండా, ఖరీదైన కార్లు అతడి దగ్గర ఉన్నాయి. రణ్‌వీర్ ఒక్క సినిమాకు రూ.50 కోట్లు వసూలు చేస్తున్నాడు. అతడి సంపద నికర విలువ రూ.245 కోట్లు ఉంటుందని సమాచారం.