/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T122753.620-jpg.webp)
Rajamouli: టాలీవుడ్ దర్శక దిగ్గజం జక్కన్న సినిమాలు బాగా తీస్తారు అనే విషయం అందరికీ తెలుసు. అయితే రాజమౌళి డాన్స్ కూడా ఇరగదీస్తారు అని తెలిసింది. షూటింగ్, సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్, సీరియస్ ఉండే జక్కన్న. వాటి నుంచి బయటకు వస్తే మాత్రం చాలా సరదాగా ఉంటారు. షూటింగ్స్ కు కాస్త గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.
Also Read: Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ అప్డేట్.. వైరలవుతున్న లుక్
రాజమౌళి, రమ డాన్స్ రిహార్సల్స్
అయితే ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన జక్కన్న సతీమణి రమతో కలిసి ప్రభుదేవ హిట్ పాటలలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా తెగ వైరలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట కోసం జక్కన్న, భార్య రమతో కలిసి రిహార్సల్స్ చేసిన మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో జక్కన్న స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
.@ssrajamouli and wife #RamaRajamouli rehearsals for the dance performance. 😁👌#SSRajamouli pic.twitter.com/609m1Nr4c5
— Suresh PRO (@SureshPRO_) April 11, 2024