Puri Jagannath Ratha Yatra: ఒడిశాలో జరిగే పూరీ జగన్నాథ్ రథయాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ ఏడాది కూడా పూరీ రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తులు వేలాది మంది తరలివచ్చారు. సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది భక్తులు గాయపడ్డారు. అదే సమయంలో ఓ భక్తుడు చనిపోయాడు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన భక్తులకు చికిత్స కొనసాగుతోంది. ఒక భక్తుడు మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను ఎక్కడి వాడు అన్నది ఇంకా తెలియలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తి కాదని...బయట నుంచి వచ్చిన వ్యక్తి అని చెబుతున్నారు.
మరోవైపు 53 ఏళ్ళ తర్వాత పూరీలో జగన్నీథుని రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. 1971 నుంచి రథయాత్రను ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల పాటూ రథయాత్రను నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రకు చాలా విశిష్టత ఉంది. దేశంలో అన్ని వైపల నుంచీ భక్తులు లక్షల మంది తరలి వస్తారు. ఈ సారి రథయాత్రను రెండు రోజులు నిర్వహించడంతో భక్తులు మరింత ఎక్కువగా వచ్చారు.
Also Read:Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి