Udhayanidhi stalin vs BJP: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన మాటల మంటలు ఇంకా చల్లారలేదు. ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం డీఎంకే(DMK)నే కాదు మొత్తం 'INDIA' కూటమికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సనాతర ధర్మాన్ని 'దోమలు, డెంగీ, మలేరియా, జ్వరం ,కరోనా'తో సమానమన్న ఉదయ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఇటు బీజేపీ నుంచే కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా ఉదయ్ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎన్డీయే, INDIA నేతలు ఎలా స్పందించారంటే:
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్: బాధ్యత మరిచి 'సనాతన ధర్మం', హిందూ మతం గురించి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. డబ్బు, సంపద రాజవంశం పదవి తనను వేలాది మంది భారతీయులను, తమిళ ప్రజలను అవమానించే పరిస్థితికి తెచ్చాడని ఉదయ్ నమ్ముతున్నట్టున్నాడని ఫైర్ అయ్యారు. తన జీవితంలో ఒక్కరోజు కూడా నిజాయితీగా పని చేయని వ్యక్తి ఉదయ్‌నిధి స్టాలిన్ అని మండిపడ్డారు.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా : ఇది జాతి నిర్మూలన పిలుపు కంటే తక్కువ కాదు.. ఉదయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్తీ చిదంబరం సమర్థించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై: 'సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలంటే, దేవాలయాలు, ప్రజల ఆవశ్యకమైన మతపరమైన ఆచార వ్యవహారాలన్నిటినీ అంతం చేయాలి.. ‘సనాతన ధర్మం’ అనే పదం క్రైస్తవుల కంటే ముందే ఉంది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన, కాలాతీతమైన ధర్మం.ఇది చాలా కాలంగా ఉంది... ఉదయనిధి మాట్లాడిన దానిని దేశంలోని 142 కోట్ల మంది ప్రజలు ఖండించాలి. నిర్దిష్ట సంస్కృతిని నిర్మూలించడాన్ని మారణహోమం అంటారు. 'సనాతన ధర్మాన్ని' రద్దు చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ఎవరు'? అని అన్నామలై తనదైన శైలిలో ఖండించారు.
కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్: 'హిందువులను దూషించడానికి నాయకుల మధ్య పోటీ ఉంది. 1,000 సంవత్సరాలుగా 'సనాతన ధర్మాన్ని' తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిని ఎవరూ చెరిపివేయలేరు' అని ఆచార్య ప్రమోద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి కూడా ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Also Read: ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమో.. సినిమా టికెట్లు కాదు బ్రదర్!-Shah Rukh Khan
ఆప్ నాయకుడు సంజయ్ సింగ్: 'దేశంలో వివిధ మతాలు, కులాలు, భాషలు ఉన్నాయి. అయినా మనం కలిసే జీవిస్తున్నాం.' అన్నారు. ఉదయనిధి ప్రకటనను ఆప్ కూడా ఖండించింది. దేశంలో మనం ప్రతి మతాన్ని గౌరవించాలని, మరొకరి మతంపై ఎవరూ వ్యాఖ్యానించకూడదని చెబుతోంది.
కట్టుబడి ఉన్నా:
అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరుపున మాట్లాడానన్నారు. దీనిపై తనకు ఎవరు ఎలాంటి నోటీసులు పంపినా, సవాళ్లు విసిరినా నేను రెడీ అంటూ ట్వీట్ చేశారు.
హిందూ సంఘాల ఆగ్రహం:
మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్‌ను పందితో పోలుస్తూ చిత్రాలను విడుదల చేశారు. తర్వాత తగలబెట్టారు. స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేతలు. దేశంలో ఆశాంతిని సృష్టించి ఎన్నికల సమయంలో లబ్ది పోందాలని చూస్తున్న స్టాలిన్‌ను తీవ్రవాదిగా గుర్తించి వెంటనే అరెస్టు చేయాలన్నారు.
ALSO READ: సనాతన ధర్మం వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదేలేదు: Udhayanidhi