Udhayanidhi Remarks row: స్టాలిన్ సనాతన ధర్మపై ఆగని మాటల మంటలు.. పొలిటికల్ రియాక్షన్స్ ఇవే!
సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. అటు 'INDIA' కూటమి కూడా డిఫెన్స్‌లో పడిపోయింది. ఉదయనిధి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ కాంగ్రెస్, ఆప్ నేతలు సైతం స్టాలిన్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరుపున మాట్లాడానని.. అంతేకానీ మతం గురించి కాదంటున్నారు ఉదయ్‌నిధి స్టాలిన్.