మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ (brs) పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 27న (రేపు) పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (cm kcr) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కూసుమంచి (kusmachi) మండలంలోని జీళ్లచెరువు (Jillacheruvu) గ్రామంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి (Paleru MLA Kandala Upender Reddy) సభ ప్రాంగణాన్ని, పార్కింగ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధుల బృందం, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజా ఆశీర్వాద సభకు (Praja asirvada meeting) తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
టార్గెట్ ఆ ఇద్దరే
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెంచారు. ఈ సభలో తుమ్మల, పొంగులేటి టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మెరుగైన ఫలితాలు పొందేలా వ్యూహ రచన చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, మేనిఫెస్టోను ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు.
తొలి బహిరంగ సభ కావడంతో..
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిత్వం పొంగులేటికి ఖరారయ్యే అవకాశం ఉండటంతో నియోజకవర్గంపై మరింత ఫోకస్ పెంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టబోయే తొలి బహిరంగ సభ కావడంతో అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీపై మండిపడ్డ బొత్స, వైవీ సుబ్బారెడ్డి..బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడి