SSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఉద్యోగాల జాతర!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల 966 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడులచేసిన విషయం తెలిసిందే. కాగా మార్చి 28 నుంచి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 18 వ‌ర‌కు కొనసాగనుండగా.. డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులే ఈ ఉద్యోగాలకు అర్హులు.

SSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఉద్యోగాల జాతర!
New Update

JOBS: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ త‌దిత‌ర విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భ‌ర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వ‌ర‌కు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుండగా పూర్తి అర్హతలు ఇలా ఉన్నాయి.

పోస్టులు : జూనియర్‌ ఇంజినీర్
మొత్తం ఖాళీలు : 966

విభాగాలు :
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ త‌దిత‌రాలు.

అర్హతలు:
డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి.

వ‌య‌స్సు :
సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుల‌కు చివరి తేదీ: ఏప్రిల్ 18

ఎంపిక  విధానం:
పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక.

జీతం :
రూ.35,400- రూ.1,12,400 వ‌ర‌కు ఉంటుంది.

తెలంగాణ‌లో పరీక్షకేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ ను సంప్రదించండి : https://ssc.nic.in/

#staff-selection-commission #966-jobs-application-start
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe