Constable Jobs: గత ఏడాది 46, 617 కానిస్టేబుల్ ఖాళీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది మళ్ళీ భారీ సంఖ్యలో ఉద్యోగాలతో వచ్చేసింది. తాజాగా 39,481 కానిస్టేబుల్ నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దీనికి సంబంధించి పరీక్షల జరగనున్నాయి. టెన్త్ పాసయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చును. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 14వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 5,6,7 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంది.
సీఐఎస్‌ఎఫ్‌లో 7,145; సీఆర్‌పీఎఫ్‌లో 11,541; ఎస్‌ఎస్‌బీలో 819; ఐటీబీపీలో 3017; ఏఆర్‌లో 1248; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 35, ఎన్‌సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి రాత పరీక్షతో పాటూ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
జీతం..
పే లెవెల్ -1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ. 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్ -3 కింద రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది.
అర్హతలు..
గుర్తింపు పొందిన బోర్టు లేదా యూనివర్శిటీ నంచి టెన్త్ లేదా మెట్రిక్యులేసన్ పాసై ఉండాలి. పురుషులు అయితే 170 సెం.మీ.ల ఎత్తు, మహిళలు అయితే 157 సెం.మీ.లకు ఎత్తు తగ్గకుండా ఉండాలి. అభ్యర్ధులు 18నుంచి 23 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ సడలింపు ఉంది.
పరీక్షా విధానం...
మొత్తం పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకూ రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ ల నుంచి ప్రశ్నలుంటాయి. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు 100 రూ. మహిళలు, ఎస్సీ, ఎస్టీ , మాజీ సైనిక అభ్యర్థులు ఫీజు చెల్లించనక్కర్లేదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం SSC Official Website లో చూడొచ్చు.
Also Read: Maharashtra: బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో కాల్పులు..ఒకరికి గాయాలు