SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ లో భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ తో పాటు ఢిల్లీలోని పోలీస్‌ విభాగం ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది

New Update
SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల!

Staff Section Commission : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) లో భారీగా ఉద్యోగాల నియామకాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌(Notification) లో బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ తో పాటు ఢిల్లీ(Delhi) లోని పోలీస్‌ విభాగం ఎస్సై ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించింది.

ఈ ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ssc.gov.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన గడువు మార్చి 28న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్‌ లో మొత్తం 4,187 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటిలో ఢిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్సై పురుషులకు 125 పోస్టులు, మహిళలకు 61 పోస్టులు కేటాయించారు. ఎస్‌ఏపీఎఫ్‌ ఎస్సై ఉద్యోగాలు మొత్తంగా 4001 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయసు 2023 ఆగస్టు నాటికి 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్డ్వ్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంది. ఈ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సీటి నుంచి డిగ్రీ పూర్తై ఉండాలి. అలాగే బైక్‌, కారు డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా ఉండాలి.

SSC అధికారిక పోర్టల్ ssc.gov.in లో అప్లై చేసుకోవాలి. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

Also Read : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్…!

Advertisment
తాజా కథనాలు