ఎస్‌ఎస్‌సీ(SSC) జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి ఇదే అలెర్ట్. జీడీ కానిస్టేబుల్, MTS, CHSL, CGL, ఢిల్లీ పోలీస్ SI సహా అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన క్యాలెండర్‌ను SSC విడుదల చేసింది మొత్తం 12 రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. SSC క్యాలెండర్ 2024 ప్రకారం వచ్చే ఏడాది మొదటి ప్రధాన రిక్రూట్‌మెంట్ ఫిబ్రవరి 1, 2024న సెలక్షన్ పోస్ట్ ఫేజ్ - 12 రూపంలో నిర్వహిస్తారు. SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్-12 కోసం దరఖాస్తులు ఫిబ్రవరి 28 వరకు తీసుకుంటారు. పరీక్ష ఏప్రిల్-మే 2024లో ఉంటుంది. క్యాలెండర్‌లోని మొదటి మూడు రిక్రూట్‌మెంట్‌లు డిపార్ట్‌మెంటల్, వీటి నోటిఫికేషన్‌లు జనవరి 5, జనవరి 12, జనవరి 19న విడుదల చేస్తారు.
Annual_Calendar_2024-25_07112023
ఢిల్లీ పోలీస్ CAPF SI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి15, 2024న విడుదల చేస్తారు. మార్చి 14 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. మే-జూన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్-2024 నోటిఫికేషన్ మార్చి 19, 2024న విడుదల చేస్తారు. పరీక్ష మే-జూన్ 2024లో జరుగుతుంది. CHSL (10+2) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 నోటిఫికేషన్ ఏప్రిల్ 2, 2024న వస్తుంది. మే 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష జూన్-జూలై 2024లో జరుగుతుంది. MTS హవల్దార్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మే 7, 2024న విడుదల చేస్తారు. పరీక్ష జూలైలో జరుగుతుంది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. జూలై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
స్టెనో గ్రేడ్ CD రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 నోటిఫికేషన్ 16 జూలై 2024న వస్తుంది. పరీక్ష అక్టోబర్ 2024లో నిర్వహిస్తారు. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష నోటిఫికేషన్ 23 జూలై 2024న విడుదల చేయబడుతుంది. పరీక్ష అక్టోబర్ 2024లో ఉంటుంది.
Also Read: క్రికెట్ చరిత్రలో నెవర్ బిఫోర్..వెయ్యేళ్లు గుర్తిండిపోయే బ్యాటింగ్..!