SSC Recruitment :స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ రేపటి(ఆగస్టు 15)తో ముగియనుంది. అర్హత ఉండి ఇంకా తమ దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in నుంచి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు ఆగస్టు 16- 17 మధ్య తమ ఫారమ్‌లను సవరించుకోవచ్చు. SSC ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
ఖాళీల వివరాలు:
SI ఢిల్లీ పోలీస్(పురుషుడు): 109 ఖాళీలు
SI ఢిల్లీ పోలీస్ (మహిళ): 53
CAPFలో SI (GD): 1714
మొత్తం 1876 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది.
వయస్సు: ఆగస్టు 1 నాటికి 20-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
అర్హత:
ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలో హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ వారు తప్పనిసరిగా కటాఫ్ తేదీ (15 ఆగస్టు) లేదా అంతకంటే ముందు డిగ్రీని కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్ 1: SSC అధికారిక వెబ్‌సైట్, ssc.nic.in ని విజిట్ చేయండి.
స్టెప్ 2: అప్లై ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: CAPF ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: 'ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, CAPF అండ్ CISF పరీక్షలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, 2023' అని ఉన్న నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. (Click on the notification link, 'Sub-Inspector in Delhi Police, CAPFs and Assistant Sub-Inspector in CISF Examination, 2023')
స్టెప్ 5: ఇది మిమ్మల్ని మీరు ముందుగా నమోదు చేసుకోవాల్సిన లాగిన్‌కి తీసుకెళ్తుంది.
స్టెప్ 6: దరఖాస్తు ఫారమ్‌తో కొనసాగండి, ఫారమ్‌ను పూరించండి
స్టెప్ 7: డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 8: దరఖాస్తు రుసుమును చెల్లించండి
స్టెప్ 9: సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 10: దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.. తర్వాత ప్రింటవుట్ తీసుకోండి.
శాలరీ: నెలకు రూ.35,400-రూ.1,12,400.
దరఖాస్తు రుసుము: జనరల్ / OBC / EWS వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.100 పే చేయాలి. SC/ ST వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) - సైంటిస్ట్ ‘B’ నోటిఫికేషన్