TDP Candidate Budda Rajashekar Reddy: శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్ బ్యాంకు పేరుతో పేదల సొమ్మును దోచేశారని ఆరోపించారు. వరదరాజుల ప్రాజెక్టు పూర్తి అయితేనే ఎన్నికలకు వస్తానన్న శిల్ప ఏ మొహం పెట్టుకొని పోటీల్లో నిలబడ్డారని ప్రశ్నించారు.
Also Read: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్..!
శ్రీశైలం దేవస్థానం అక్రమాలు మరింత పెరిగిపోయాయని మండిపడ్డారు. స్థానికులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్థానికేతరులకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు వచ్చే జీతాల్లో కోతలు విధించారని ఆరోపించారు. కార్మిక చట్టాన్ని తుంగల్లో తొక్కారని నిప్పులు చెరిగారు. తాను గెలిస్తే శ్రీశైలం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని..స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.