Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,40,902 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 864 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 TMCలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 118. TMCల వద్ద ఉంది.
కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి.. నాగార్జునసాగర్‌కు (Nagarjuna Sagar) 57,289 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే..రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు