Srisailam: శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకలు సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.దీంతో శ్రీశైలం రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

New Update
Srisailam: శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తింది. దీంతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకలు సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా పర్యాటకులు తరలివచ్చారు.ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, సందర్శకులు ఆ తర్వాత జలాశయం వద్దకు వచ్చి కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు.

Also Read: రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్ లో ధన్వంతరి వార్డు ప్రారంభోత్సవం!

దీంతో శ్రీశైలం రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రతి షిఫ్ట్‌కు 25 మంది సిబ్బందికి కేటాయిస్తున్నామని సీఐ రమేష్ బాబు తెలిపారు.

Also Read: వయనాడ్ బాధితులకు అండగా కర్ణాటక.. 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటన

Advertisment
తాజా కథనాలు