/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/YCP-MLA-PA-jpg.webp)
YCP MLA PA Suicide: ఏపీలోని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగున్నరేళ్లపాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న ఆయన నిన్న(బుధవారం) రాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్‌లోకి డబ్బు జమ