Gaganyaan TV-D1 Mission: శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ ప్రయోగానికి ముందు శనివారం ఉదయం జరపనున్న టెస్ట్ వెహికల్ డీ1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీహరికోటలోని (Sriharikota) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ చిన్న రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఇది కేవలం 16.9 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే భవిష్యత్‌లో ఈ పరిశోధన ఇస్రో శాస్త్రవేత్తలకు (Isro Scientists) ఎంతో ఉపయోగపడుతుంది. గగన్‌యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే ఘట్టంలో భాగంగా ఏదైనా అవాంతరం చోటు చేసుకుంటే క్షేమంగా వారు తప్పించుకోవడానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టంను ఉపయోగిస్తున్నారు. మనుషులు ప్రయాణించే క్రూ మాడ్యూల్ ఖాళీగా ఉంచి ఒక చిన్న రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఏషియన్ గేమ్స్ క్రీడాకారులను అభినందించిన జగన్… భారీ నజరానా ప్రకటన
శాస్త్రవేత్తలను ఉత్సాహ పరుస్తూ..
ఇది అంతరిక్షంలో తక్కువ దూరంలో చేరిన తర్వాత రాకెట్ నుంచి విచ్చుకొని పారాచూట్ల సహాయంతో సముద్రంలో ఒక చోట అత్యంత భద్రంగా దిగడం ఈ ప్రయోగం ప్రాధాన్యత, అనంతరం క్రూమాడ్యూల్‌ను షిప్ల ద్వారా భూమికి తీసుకొస్తారు. ఇటువంటి ప్రయోగాలు గగన్‌యాన్‌కు ముందు ఇంకా అవసరమై ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి ప్రధానమంత్రి గగన్‌యాన్ ప్రయోగాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం ప్రయోగంపై కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతోనూ, ఆదిత్య ఎల్1 (Aditya L-1) కూడా సూర్యుని వైపు లాగ్రాంజ్ పాయింట్‌కు దగ్గర అవుతున్న సమయాన ప్రధానమంత్రి విజయవంతంగా ప్రయోగించడానికి శాస్త్రవేత్తలను ఉత్సాహ పరుస్తున్నారు.
అందరూ ఆసక్తితో ఎదురు చూపు
ఇందులో భాగంగా ఆయన ఇటీవల శాస్త్రవేత్తలు కేంద్ర ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాస్తవానికి 2025లో మాత్రమే అసలుసిసలైన గగన్‌యాన్ ప్రయోగం జరపనున్నారు. అప్పటికి మనుషులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ఇస్రో మరో చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. అంతకుముందు జరిగే వివిధ పరిశోధనలు, పరీక్షలను సక్రమంగా జరపడానికి కేంద్రప్రభుత్వం ఇస్రోకు అన్ని విధాలా సహాయం చేస్తోంది. ఈ కారణంగా శనివారం శ్రీహరికోట నుంచి జరిగే క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం ప్రయోగం సైతం శాస్త్రవేత్తలు ఆశించిన మేరకు విజయవంతం కావాలని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.