SRH Vs GT : సన్ రైజర్స్ కి ఇదే మంచి ఛాన్స్.. అలా జరిగితే డైరెక్ట్ టాప్-2 లోనే!

మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. RR ఆఖరి మ్యాచ్ లో ఓడి, SRH కూడా రెండింటిలో ఒకటి ఓడితే అప్పుడు కూడా సన్ రైజర్స్ టీమ్ టాప్-2 తో ముగించే ఛాన్స్ ఉంది.

New Update
SRH Vs GT : సన్ రైజర్స్ కి ఇదే మంచి ఛాన్స్.. అలా జరిగితే డైరెక్ట్ టాప్-2 లోనే!

SRH Vs GT :IPL 2024 లీగ్ దశలో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది.

ఈ రెండు మ్యాచులు హైదరాబాద్ గెలిస్తే SRH ఖాతాలో 18 పాయింట్లు వచ్చి చేరతాయి. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ వేదికగా ఈ మ్యాచులు జరగనుండటం, సొంత గడ్డపై SRH కి ఉన్న రికార్డ్ చూస్తే హైదరాబాద్ ఈ రెండు మ్యాచులు గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది.

Also Read : భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన 

ఒక్కటి గెలిచినా చాలు

SRH రెండు మ్యాచులలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. రాజస్థాన్(Rajasthan) కనుక తమ ఆఖరి మ్యాచ్ లో ఓడి, హైదరాబాద్ కూడా రెండింటిలో ఒకటి ఓడితే అప్పుడు కూడా సన్ రైజర్స్ టీమ్ టాప్-2 తో ముగించే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెండు జట్లకు సమానంగా పాయింట్స్ వచ్చినా రన్ రేట్ పరంగా సన్ రైజర్స్ ముందుంటే రాజస్థాన్ ని వెనక్కి నెట్టొచ్చు.

అప్పుడు పాయింట్స్ టేబుల్ లో సన్‌రైజర్స్‌ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్‌-1కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ SRH కనుక రెండు మ్యాచుల్లో ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది. రెండు మ్యాచులు ఓడినా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే కేకేఆర్‌- రాజస్తాన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆర్సీబీ మ్యాచ్‌ రిజల్ట్స్ పై డిపెండ్ అయి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు