Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. 2021 లో విడుదలైన పుష్ప పార్ట్ 1 సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన అల్లు అర్జున్ స్పెషల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #2024RulePushpaKa అంటూ విడుదల చేసిన హ్యాష్ ట్యాగ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు మేకర్స్. దీంతో పుష్ప 2 వాయిదా అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Pushpa 2: పుష్ఫ2 ఐటమ్ సాంగ్.. సమంతకు మించి ఊపేయనున్న బోల్డ్ బ్యూటీ
పుష్ఫ పార్ట్ 1 సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. కొన్ని రీజులు గా సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట్లో వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో శ్రీలీల కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: