Sreeleela: సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే!

తెలుగు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ముంబయికి వెళ్లిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లింది.

Sreeleela: సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే!
New Update

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే చెప్పే పేరు శ్రీలీల(Sreeleela) . పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..అగ్రహీరోలందరితో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఈ ఏడాది మొత్తంలో ఐదు సినిమాలు విడుదల చేసిన ఏకైక హీరోయిన్‌ అంటే..రెండు నెలలకు ఓ సినిమా అనమాట.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మహేష్‌ బాబు (Mahesh Babu) సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత పవన్‌ సరసన్ ఓ సినిమా తీస్తుంది. ఇంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సడెన్‌ గా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి తల్లితో కలిసి ముంబయికి వెళ్లిపోయింది.

ఇలా శ్రీలీల సడెన్‌ గా ముంబయికి ఎందుకు వెళ్లిపోయిందని అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతుంది. భగవంత్ కేసరి సినిమా షూట్‌ లో ఉన్నప్పుడు కూడా పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపించేది. ఇప్పుడు ఆమెకు ఎగ్జామ్స్‌ దగ్గరికి వచ్చాయి.

దాంతో శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లిపోయింది. ఎగ్జామ్స్‌ ఉన్న అన్ని రోజులు కూడా సినిమా షూటింగ్‌ లకు బ్రేక్‌ ఇచ్చేసింది. ఎగ్జామ్స్‌ అయిపోయిన తరువాత యాక్టర్‌ శ్రీలీల కాస్త ..డాక్టర్‌ శ్రీలీల అయిపోతుందన మాట. ఈ క్రమంలోనే బెంగళూరులో శ్రీలీల ఓ హస్పిటల్‌ ను కట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్‌.

ఎంబీబీఎస్‌ తరువాత పై చదువులు చదువుతుందా..లేక సినిమాలు కంటిన్యూ చేస్తుందా అనే విషయం మాత్రం ప్రస్తుతం సస్పెన్స్‌ గా మారింది. దీని గురించి శ్రీలీలనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also read: రైతు బిడ్డ మిస్సింగ్..పోలీసుల సెర్చింగ్‌!

#mumbai #movies #mbbs #sreeleela #exams #break
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe