/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30-2.jpg)
Hockey Goal Keeper Sreejesh: పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రారంభోత్సవంలో పతాకధారులుగా పీవీ సింధు, శరత్ కమల్‌లు పతాధారులుగా వ్యవహరించారు. మిగతా క్రీడకారులందరికీ వారు ప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రారంభ వేడుకల్లానే ఒలింపిక్స్ ముగింపు వేడుకలను కూడా గ్రాండ్‌గా నిర్వహిసతారు. దీనిలో కూడా క్రీడాకారులు మార్చ ఫాస్ట్ చేస్తారు. అయితే ఇందులో ఈసారి భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్ తో పాటూ హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజశ్ ఉండనున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. క్రీడాకారులతో సంప్రదించాకన శ్రీజేశ్‌ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.
శ్రీజేశ్ ఇరవై ఏళ్ళుగా భారత క్రీడలకు సేవలందించారు ప్రస్తుతం భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించారు. దాంతో పాటూ శ్రీజేశ్ తన హాకీ కెరీర్ కు వీడ్కోలు కూడా పలికారు. ఈ నేపథ్యంలో అతనికి ఈ గౌరవం ఇచ్చినట్టు పీటీ ఉష తెలిపారు.
అయితే ముగింపు వేడుకల్లో పతాకధారిగా మనుబాకర్‌తో పాటూ అథ్లెట్ నీరజ్ చోప్రా ఉడాల్సింది. కానీ శ్రీజశ్‌కు అవకాశం ఇవ్వాలని నీరజ్ ను పీటీ ఉష అడగ్గా అందుకు అతను సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు నన్ను అడగకపోయినా నేను శ్రీజేశ్ పేరును సూచిస్తానని నీరజ్ చెప్పాడని ఉష తెలిపారు.
Also Read: Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు