ICC World Cup 2023:ఆరోసారి సగర్వంగా ప్రపంచకప్ ను ముద్దాడిన కంగారూలు
మ్యాచ్ గెలిచి సగర్వంగా వరల్డ్ కప్ ను ఎత్తుకుంది ఆస్ట్రేలియా.ఆరోసారి తమ దేశానికి కప్పును తీసుకువెళుతోంది. అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మాత్రం మన ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీకే దక్కింది.
మ్యాచ్ గెలిచి సగర్వంగా వరల్డ్ కప్ ను ఎత్తుకుంది ఆస్ట్రేలియా.ఆరోసారి తమ దేశానికి కప్పును తీసుకువెళుతోంది. అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మాత్రం మన ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీకే దక్కింది.
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ.
గుండెనెవరో గట్టిగా మెలిపెడుతున్న బాధ భారత క్రికెట్ అభిమానిది. ప్రపంచకప్ కు అడుగు దూరంలో భారత జట్టు తడబడిన వేళ.. పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే - అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం ఆవరించింది. లక్షా ముప్పై వేల గుండెలు పగిలిన చప్పుడే వినిపించింది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ట్రోఫీ గెలుపొందిన టీమ్‌కు ట్రోఫీతో పాటు భారీగా ప్రైజ్ మనీ అందించనున్నారు. గెలిచిన టీమ్‌కు రూ. 33.31 కోట్లు, రన్నరప్ టీమ్‌కు రూ. 16.65 కోట్లు నజరానా ఇవ్వనున్నారు.
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్‌లో తడపడింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. అటు కోహ్లీ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సపోర్టర్‌గా గుర్తించారు.
మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచ్‌కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన జాన్ అనే ఆస్ట్రేలియన్ పిచ్ మధ్యలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని అహ్మదాబాద్‌లోని చంద్ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.