అడుగు దూరంలో మరో రికార్డ్.. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ సరసన జైస్వాల్!

భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.

New Update
jaiswal

Sports: భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు. 40 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ క్రియేట్ చేసిన చరిత్రను మరో 97 పరుగులు చేస్తే అధిగమించే అవకాశం ఉంది. 

ఈ మేరకు 40 ఇన్నింగ్స్ ల్లో రాహుల్ ద్రవిడ్‌ 1999లో న్యూజిలాండ్‌పై, వీరేంద్ర సెహ్వాగ్‌ 2004లో ఆస్ట్రేలియాపై ఈ రికార్డు క్రియేట్ చేశారు. 2023 జులైలో వెస్టిండీస్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్‌ల్లో 52.86 యావరేజ్‌తో 1903 రన్స్ చేశాడు. అయితే జులై 2 నుంచి ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో జైస్వాల్ రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక మొదటి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో101 పరుగులు చేశాడు జైస్వాల్. 

Advertisment
Advertisment
తాజా కథనాలు