/rtv/media/media_files/2026/02/17/gambhir-2026-02-17-12-30-51.jpg)
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి ఊహించని భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో యాజమాన్య మార్పులు జరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లు గంభీర్‌కు ఏకంగా మూడు రకాల కీలక బాధ్యతలను ఒకేసారి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
గంభీర్‌కు రాజస్థాన్ రాయల్స్ సీఈఓ పోస్టుతో పాటుగా.. మెంటర్, ఫ్రాంచైజీలో 2 నుండి 3 శాతం వాటా అంటే కేవలం జీతం మాత్రమే కాకుండా, జట్టులో యజమానిగా కూడా గంభీర్ ఉంటారన్నమాట. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ సుమారు $1.3 బిలియన్ డాలర్లు (దాదాపు ₹10,800 కోట్లు) గా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో గంభీర్ ఈ ఆఫర్‌ను అంగీకరించడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ నిబంధనల ప్రకారం.. భారత జాతీయ జట్టుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏకకాలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఎటువంటి పదవులు నిర్వహించకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆయన ఒప్పందం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంది.
ఒకవేళ రాజస్థాన్ ఆఫర్ తీసుకోవాలంటే, ఆయన టీమిండియా కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌కు పతకం అందించడమే లక్ష్యంగా గంభీర్ పని చేస్తున్నారు.ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వార్షిక వేతనం రూ. 12 కోట్ల నుంచి రూ. 14 కోట్ల మధ్య ఉంది. గత కోచ్ రాహుల్ ద్రవిడ్ సుమారు రూ. 12 కోట్లు తీసుకోగా, గంభీర్ అంతకంటే ఎక్కువే అందుకుంటున్నట్లు సమాచారం.
ఏడాదికి సుమారు రూ. 25 కోట్లు
విదేశీ పర్యటనల్లో రోజుకు రూ. 21,000 వేలు, బిజినెస్ క్లాస్ ప్రయాణం, పర్యటనల్లో ఫైవ్ స్టార్ హోటల్ వసతి, పనితీరు ఆధారంగా బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు ఉంటాయి. గంభీర్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెంటర్ గా ఉన్నప్పుడు ఏడాదికి సుమారు రూ. 25 కోట్లు తీసుకునేవారు. బీసీసీఐతో గంభీర్ ఒప్పందం 2024 జూలై నుండి 2027 డిసెంబర్ (వన్డే వరల్డ్ కప్) వరకు అమల్లో ఉంటుంది.
Follow Us