/rtv/media/media_files/2026/03/01/west-indies-set-a-challenging-target-of-196-in-20-overs-2026-03-01-20-54-52.jpg)
West Indies set a challenging target of 196 in 20 overs
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ అదరగొట్టింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. సెమీస్‌కు వెళ్లాలంటే టీమిండియా ఈ భారీ టార్గెట్‌ను ఛేదించాల్సిందే. విండీస్ ఓపెనర్లు హోప్ 32, ఛేజ్ 40 పరుగులు చేసి శుభారంభం చేశారు. హిట్మెయర్ 12 బంతుల్లో 27 పరుగులు చేశారు. ఇక చివర్లో వచ్చిన పావెల్ 34, హోల్డర్ 37 పరుగులతో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. బుమ్రా 2 వికెట్లు తీయగా.. హార్డిక్ పాండ్యా, వరుణ్ తలొ వికెట్ పడగొట్టారు.
Super 8 ICC T20 World Cup | West Indies (195/4) set a target of 196 runs for India.
— ANI (@ANI) March 1, 2026
The winner of this match will move to the Semi-Finals.
(Pic Source: BCCI) pic.twitter.com/TwMtPplJu6
బూమ్రా బౌలింగ్‌లో హెట్ మెయిర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ సమయంలో వెస్టిండీస్ స్కోర్ 11.3 ఓవర్లకు 102 పరుగులుగా ఉంది. రావెన్ పావెల్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 34 పరుగులు చేశాడు. జాసన్ హోల్డర్ 22 బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లు కొట్టి 37 పరుగులు అందించాడు. వీళ్లిద్దరీ జోడీతో 76 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ రెండు క్యాచ్‌లు మిస్ చేయడంతో టీమ్‌కు మైనస్‌గా మారింది. మొత్తంగా విండీస్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
Follow Us