ఆస్ట్రేలియా ప్రధానికి పంచ్ ఇచ్చిన కోహ్లీ.. మసాలా బ్యాచ్ అంటూ

విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 'కోహ్లీ సెంచరీపై మావారు పెద్దగా బాధపడినట్లు లేరు' అని ఆంథోని అనగానే ‘మీరు మసాలా కలిపేందుకు ముందుంటారు' అంటూ కోహ్లీ సెటైర్ వేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

author-image
By srinivas
New Update
dded

Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకున్నారు. ముందుగా కోహ్లీని కాంట్రవర్సీ కామెంట్స్ తో ఆంథోని రెచ్చగొట్టగా ఏమాత్రం తగ్గని విరాట్ అదే వేగంతో భారీ పంచ్ విసిరాడు. దీంతో ఇరువురితోపాటు ప్రేక్షకులను నవ్వులు పూయిస్తున్న ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  

కోహ్లీ సెంచరీని ఉద్దేశిస్తూ..

ఇక అసలు విషయానికొస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా బుధవారం ఆస్ట్రేలియా ప్రధానిని మీట్ అయ్యారు. ప్రైమ్‌మినిస్టర్స్‌ XI జట్టుతో శనివారం వార్మప్‌ మ్యాచ్‌ను ఆడనుండగా.. ఈ నేపథ్యంలో కాన్‌బెర్రాలోని పార్లమెంట్‌ హౌస్‌లో ఆల్బనీస్‌తో భేటీ అయ్యారు. ఆటగాళ్లతో ఫొటోలు దిగి సందడి చేసిన ప్రధాని పెర్త్‌ తొలి టెస్టులో కోహ్లీ సెంచరీని ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. 

‘పెర్త్‌లో అద్భుతం జరిగింది. కానీ ఆ టైమ్ లో మా వాళ్లు పెద్దగా బాధపడినట్లు అనిపించలేదు’ అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన విరాట్.. ‘మీరు మసాలా కలిపేందుకు రెడీగా ఉంటారు’ అంటూ సెటైర్ వేశాడు. దీంతో ఆల్బనీస్‌ తోపాటు ఆటగాళ్లంతా నవ్వుకున్నారు. ఇక ఈ ఫొటోలను ఆల్బనీస్‌ నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘భారత్‌తో ఆడటం ప్రైమ్‌మినిస్టర్స్‌ XIకు బిగ్ ఛాలెంజ్. మోదీకి చెప్పినట్లే మా వాళ్లు అద్భుతంగా ఆడేందుకు నేను మద్ధతుగా ఉంటా’ అంటూ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు