Kohli: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ జోరు తగ్గిపోయిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. గత కొంతకాలంగా కోహ్లీ గణంకాలను చూస్తే సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్ధలు కొట్టడం కష్టంగా కనిపిస్తోందన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీకి అసాధ్యం..
ఈ మేరకు ‘విరాట్ లో మునుపటి దూకుడు లేదు. సచిన్ రికార్డులు బ్రేక్ చేస్తాడని భావించినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం కష్టంగా కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా కోహ్లీ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. మరో పది టెస్టుల్లో భారీగా రన్స్ చేసినా సచిన్ రికార్డులు చెరపడం అసాధ్యం' అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు.
ఇక సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 146 టెస్టుల్లో 12,402 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ మరో 3,500+ పరుగులు చేస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.