AUS vs IND: బిగ్‌ షాక్.. విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.  

New Update
kohli

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.  బార్ట్‌లెట్ బౌలింగ్‌లో (6.1వ ఓవర్) షాట్‌కు యత్నించిన గిల్.. మిచెల్‌ మార్ష్ చేతికి చిక్కడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 17 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది భారత్. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో (6.5వ ఓవర్) ఎల్బీ అయిన విరాట్.. డీఆర్‌ఎస్‌ కూడా తీసుకోకుండానే పెవిలియన్‌కు వెళ్లాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడుపుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లకు 17/2 గా ఉంది. కాగా తొలి వన్డేలో భారత్ ఓడిపోగా...  రోకో దారుణంగా ఫెయిల్ అయ్యారు. రోహిత్ 8 పరుగులు చేయగా.. కోహ్లీ డౌకట్ గా వెనుదిరిగాడు. 


జట్లు 

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

Advertisment
తాజా కథనాలు