/rtv/media/media_files/2025/02/05/team-india-player-trisha.jpeg)
తెలంగాణ బిడ్డ, భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష ఇటీవల జరిగిన ఐసీసీ U19 టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టి భారత్‌ను ఫైన్‌లో గెలిపించింది.
/rtv/media/media_files/2025/02/05/team-india-player-gongadi-trisha.jpeg)
అనంతరం ఆమె ఇండియాకు తిరిగి రావడంతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తాజాగా గొంగడి త్రిష తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
/rtv/media/media_files/2025/02/05/revanth-reddy-announces-rs-1-crore-reward-for-gongadi-trisha.jpeg)
ఐసీసీ U19 టీ20 వరల్డ్ కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
/rtv/media/media_files/2025/02/05/revanth-reddy-announces-rs-1-crore-reward-for-gongadi-trisha-news.jpeg)
అంతేకాకుండా భారీ పారితోషికం ప్రకటించారు. దాదాపు కోటి రూపాయల నజరానా సీఎం ప్రకటించారు.
/rtv/media/media_files/2025/02/05/gongadi-trisha.jpeg)
గొంగడి త్రిషతో పాటు మరో క్రీడాకారిణిని ఆయన అభినందించి రివార్డు అందించారు. అండర్-19 వరల్డ్ కప్ టీం మెంబర్, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ. 10 లక్షల నజరానా ప్రకటించారు.
/rtv/media/media_files/2025/02/05/team-india-player-trisha.jpeg)
వీరితో పాటు అండర్-19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.
/rtv/media/media_files/2025/02/05/gongadi-trisha.jpeg)
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.