/rtv/media/media_files/2025/07/24/ind-vs-eng-2025-07-24-16-09-50.jpg)
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇదే నెలలో కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షెడ్కూల్ రిలీజ్ చేసింది. 2026 జులై 1న తొలి టీ20, 4న రెండో టీ20, 7న మూడో టీ20, 9న నాలుగో టీ20, 11న ఐదో టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు.
5⃣ T20Is. 3⃣ ODIs
— BCCI (@BCCI) July 24, 2025
📍 England
Fixtures for #TeamIndia's limited over tour of England 2026 announced 🙌#ENGvINDpic.twitter.com/Bp8gDYudXW
షెడ్యూల్ ఇదే
జులై 14న తొలి వన్డే, 16న రెండో వన్డే, 19న మూడో వన్డే జరగనుంది. ఐదు టీ20 మ్యాచ్ లలో నాలుగు టీ20లు రాత్రి 11 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇక వన్డేలు సాయంత్రం 5; 30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ 8 మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోని 8 వేర్వేరు వేదికల్లో జరగనున్నాయి. ఇదిలా ఉండగా భారత మహిళా జట్టు వచ్చే ఏడాది మూడు వన్డే, టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది.