/rtv/media/media_files/C4IGfxe35anUW61spHqj.jpg)
బంగ్లా దేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో మన టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటారు. ఈ ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
తొలి స్థానంలో ఉన్న స్పిన్నర్ అశ్విన్ ను వెనక్కి నెట్టి బుమ్రా అగ్ర స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 870 రేటింగ్ పాయింట్స్ తో టాప్ లో ఉండగా.. అశ్విన్ కు 869 రేటింగ్ పాయింట్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ ఉండగా.. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టాప్ 6 ప్లేయర్స్ లో ముగ్గురు మన టీమిండియా బౌలర్లు ఉండటం విశేషం.
Jasprit Bumrah is the No. 1 Test bowler 🙌
— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2024
The India quick has climbed above R Ashwin at the top of the ICC Test bowling rankings 🔥 pic.twitter.com/NEiDfn8VHq
బ్యాటింగ్ లోనూ మనమే..
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధ సెంచరీలు చేసి తన ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 12 వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ మూడు స్థానాలు కోల్పోయి 9 వ స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 15.. శుభమాన్ గిల్ 16 వ ర్యాంక్ లో నిలిచారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన ఫస్ట్ ప్లేస్ ను నిలుపుకోగా.. విలియం సన్ రెండో స్థానంలో ఉన్నాడు.